- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచీ ఎడతెరపిలేని వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. సీఎస్ కె.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పలు జిల్లాల్లో ఈరోజు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC), హైడ్రాతో (Hydraa) పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని, భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి ఆదేశాలు జారీ చేశారు.






