- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. కాంగ్రెస్ పాలసీలే కారణం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధికి ఆనాటి కాంగ్రెస్ పాలసీలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంత త్యాగం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన గుర్తు చేశారు. పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి సంతకాన్ని ఉచిత సంతకం, రైతులపై కేసుల మాఫీ, రూ.1300 కోట్ల రైతు వ్యవసాయ బిల్లుల బకాయిల రద్దుపై చేశారన్నారు. దాని ద్వారా వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలని ఉచిత కరెంటును తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తుమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల తదితర ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో పదేళ్లు ప్రణాళికలు రచించి వేగంగా పూర్తి చేసేందుకు ఆనాటి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేసిందన్నారు. ఒకప్పుడు ఎండాకాలంలో మంచినీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని, కృష్ణాజలాలను పి.జనార్థన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండి హైదరాబాద్ కు తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి చాలా పనులు ఆనాటి ప్రభుత్వాల హయాంలో జరిగాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగడం వల్లే విభజనకు ఏపీ వాళ్లు అబ్జెక్షన్ చెప్పారని, హైదరాబాద్ ఆదాయంలో కూడా వాటా అడిగారని సీఎం గుర్తు చేశారు. పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అందించిందని తెలిపారు.
కానీ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించి పదేళ్లు పట్టం కట్టారన్నారు. పదేళ్ల తర్వాత ప్రజాపాలన వచ్చిందని, తమ రెండేళ్ల పాలనలో అనేక పనులు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రెండేళ్ల పాలనలో చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే చెరిగిపోయేవి కాదన్నారు. పంటలకు కనీస మద్దతు ధరను తీసుకువచ్చి రైతులను కాపాడామన్నారు. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షకోట్ల రూపాయల్ని కొల్లగొట్టిందని విమర్శించారు. నాలెడ్జ్ హబ్ గా హైదరాబాద్ మారిందనేందుకు కాంగ్రెస్ పాలసీనే కారణమన్నారు. నేడు హైదరాబాద్ కు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్, నీళ్లు ఇవ్వడం ద్వారా సాధ్యమైందన్నారు. దేశంలోని గ్లోబల్ కంపెనీల్లో 70 శాతం కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని, ఆ అప్పు కడుతూనే సంక్షేమ పథకాల అమలుతో పాటు ఇతర పనులు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలసీలే తెలంగాణ గ్రోత్ ఇంజిన్స్ గా మారాయని పేర్కొన్నారు.
READ MORE .....
కాలేజీల బంద్ పై మరోసారి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు






