CM Revanth reddy: ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనానికి సీఎం శంకుస్థాపన

by Prasad Jukanti |

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ కీలక ముందడుగు పడింది.

CM Revanth reddy: ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనానికి సీఎం శంకుస్థాపన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‍మెట్ అథారిటీ (ఎఫ్‍సీడీఏ) (Future City Development Authority) కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Next Story