- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: చంద్రబాబు ..మా ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM Chandrababu) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్న.. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానంగా అభివృద్ధి చేందాలనే ఆలోచనతో ఉన్నది నిజమే అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మా ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఉదారంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. మీరు పదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను కేసీఆర్ తన హాయంలో పూర్తిచేయలేదు. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం. గతంలో పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నానని చెప్పారు. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనిచ్చి మమ్మల్ని బ్రతకనివ్వండి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనక నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకువెళ్లడాకి అవకాశం ఉంటే ఇప్పుడు తొమ్మిదిన్నర టీఎంసీల నీళ్లు తరలించేందుకు మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు తరలించే రాయలసీమకు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మీ ఉదారతను ప్రదర్శించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవారు. మీ మేలు ఎప్పటికి మర్చిపోమన్నారు. మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది. పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’ అన్నారు. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా, ఇక్కడి సూర్యుడు అక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పారు.






