- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. టీ.బీజేపీకి BIG షాక్
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ(Telangana BJP) సుప్రీంకోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ కేసును విచారణను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది.






