- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలస్తీనా సంఘీభావ సభకు సీఎం రేవంత్ రెడ్డి!
by Ramesh Naini |
ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘పాలస్తీనా సంఘీభావ సభ’కు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘పాలస్తీనా సంఘీభావ సభ’కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారని ఇవాళ ఓ ప్రకటన చేశారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోందని, ఈ నేపథ్యంలో పాలస్తీనా పౌరులకు ప్రపంచమంతా అండగా ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాలస్తీనా సంఘీభావ సభను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కూనంనేని పేర్కొన్నారు.
Next Story






