- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: కాసేపట్లో మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రులు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రులు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు వెళ్లనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు నిండిన తరుణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) పుట్టిన గడ్డ మోవ్ (Move) గ్రామం అంబేద్కర్ నగర్‌లో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీకి ఏఐసీసీ (AICC) పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి పలువురు కాంగ్రెస్ (Congress) నేతలు తరలివెళ్తున్నారు. అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), తదితరులు ర్యాలీలో పాల్గొననున్నారు. కాగా, ఈనెల 16 దావోస్ (Davos) వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దాదాపు తొమ్మిది రోజులు పర్యటించి 25న ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అదే సమయంలోనే రాష్ట్ర మంత్రులు కూడా కర్ణాటక (Karnataka)లోని బెలగావికి వెళ్లి వచ్చి విషయం అందరికీ తెలిసిందే.






