- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయియించనున్నట్లు చెప్పారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరే ముందు మీడియాతో చిట్‌చాట్ (Revanth Reddy Chit Chat) నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. హైదరాబాద్‌కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటకలో కులగణన అంశంపై అధిష్టానంతో చర్చించేందుకేనని చెప్పారు. తెలంగాణలో కులగణన నిర్వహణ అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చించినట్లు స్పష్టం చేశారు.
పాత మంత్రుల శాఖల్లో మార్పల్లేవా..?
కొత్త మంత్రులకు (New Ministers) తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించబోతున్నట్లు సీఎం వ్యాఖ్యానించడంతో పాత మంత్రుల శాఖల్లో మార్పు లేనట్లే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. వీటిలో ఏయే శాఖలను ఎవరెవరికి కేటాయించబోతున్నారనేది ఇవాళ తేలుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్‌లో ఎంట్రీ లేదు..
కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని సీఎం ధ్వజమెత్తారు. నేనున్నంత వరకు కాంగ్రెస్‌లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో బాషా గ్యాంగ్ మాదిరిగా బీఆర్ఎస్ నేతల పంచాయతీ ఉందని విమర్శించారు. మీడియా దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కిషన్‌రెడ్డి ఒక్కటేనన్నారు. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై (Kaleswaram) మీడియాతో మాట్లాడుతానని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని చెప్పారు. కిషన్‌రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నదని ఆయనేనని ఆరోపించారు. రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, కేబినెట్ మంత్రిగా తెలంగాణ అంశాలపై తనతో కిషన్‌రెడ్డి ఒక్క రివ్యూ కూడా జరపలేదన్నారు. మెట్రో విస్తరణ కేటీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టే కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు.






