- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని సిద్ధిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని సిద్ధిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగాయి. వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హుస్నాబాద్ నియోజకరవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఏ స్థాయిలో పంటనష్టం జరిగిందో తెలుసుకున్నారు.
అనంతరం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. నీటమునిగిన పంటపొలాలు, ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. సమ్మయ్యనగర్, పోతన నగర్, రంగంపేట, నయీంనగర్ బ్రిడ్జిని పరిశీలించనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ లో తుపాను ముంపు ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వీక్షించనున్నారు. కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
గురువారమే సీఎం రేవంత్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే సాధ్యం కాదని అధికారులు ప్రోగ్రామ్ ను వాయిదా వేశారు.






