శంకర్‌మఠ్‌లో సీఎం రేవంత్‌ ప్రత్యేక పూజలు.. విధుశేఖర భారతీ స్వామితో భేటీ

by Kema Shiva Kumar |

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ నగరంలోని నల్లకుంటలో ఉన్న శంకర్‌మఠ్‌ (Shankar Math)కు వెళ్లారు.

శంకర్‌మఠ్‌లో సీఎం రేవంత్‌ ప్రత్యేక పూజలు.. విధుశేఖర భారతీ స్వామితో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ నగరంలోని నల్లకుంటలో ఉన్న శంకర్‌మఠ్‌ (Shankar Math)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. అయితే, ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి (Vidhusekhara Bharathi Swamy) నగరంలోని శంకర్‌మఠ్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా శంకర్‌మఠ్‌కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని దివ్య ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా సీఎం వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను విధుశేఖర భారతీ‌ స్వామి వారికి సమగ్రంగా వివరించారు.

Next Story