- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని కోఠీ (Koti)లో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (Chakali Ailamma Women's University) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి గొప్ప కీర్తి లభిస్తోందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పోటీ పడాలని విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఆయన పిలపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Former Prime Minister Rajiv Gandhi) కన్న కలలను నిజం చేయాలని అన్నారు.
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష్లను కల్పించే సందర్భం వస్తుందని.. అందులోనూ విద్యార్థుల ప్రతినిధ్యం ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా మహిళలకు అవకాశం ఇస్తే.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని దేశానికే అదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని అన్నారు. అశేష తెలంగాణ ఆడబిడ్డలకు అన్నగా.. ఆర్టీసీ (TRC) బస్సులో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి (Maha Lakshmi) పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యతను అప్పగించామని గుర్తు చేశారు.
ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు.. వారిలోనూ వ్యాపారవేత్తలుగా రాణించే సత్తా ఉందని, తప్పక వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పింస్తుందని హామీ ఇచ్చారు. అదానీ (Adani), అంబానీ (Ambani)లతో వ్యాపారంలో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నామని అన్నారు. రెండున్నరేళ్లలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (Chakali Ailamma Women's University)లో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలని.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశానని స్పష్టం చేశారు. యూనివర్సిటీ నిర్మాణంలో నిధులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని.. చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని సీఎం రేవంత్ అన్నారు.






