CM Revanth: సారపాకకు సీఎం రేవంత్.. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-06 08:28:56  IST  )

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ పథకం సూపర్ రెస్పాన్స్‌‌ను సొంతం చేసుకుంది.

CM Revanth: సారపాకకు సీఎం రేవంత్.. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ పథకం సూపర్ రెస్పాన్స్‌‌ను సొంతం చేసుకుంది. ఈ పరిణామంతో లబ్ధిదారులు సన్న బియ్యం కోసం రేషన్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు (Congress Leaders) ఏదో ఒకరోజు లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే ఇవాళ భద్రాచలం (Bhadrachalam) రాముల వారి కళ్యాణాన్ని తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేరుగా అక్కడి నుంచి బూర్గంపాడు (Burgampadu) మండల పరిధిలోని సారపాక (Sarapaka)కు చేరకున్నారు. అక్కడి సన్న బియ్యం లబ్ధిదారుడు శ్రీను (Srinu) ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అదేవిధగా సీఎం వెంట వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రుల తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా అక్కడే భోజనం ఆరగించారు.



Next Story