ఒకే విమానంలో ప్రయాణించిన CM రేవంత్, హరీష్ రావు.. 2 గంటలు ఏం మాట్లాడుకున్నారు?

by Disha Web Desk 2 |
ఒకే విమానంలో ప్రయాణించిన CM రేవంత్, హరీష్ రావు.. 2 గంటలు ఏం మాట్లాడుకున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్/ కంది: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి, రెండో బాధితుడు రఘునందన్ రావు అని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్తలు వచ్చాయని తెలిపారు. విపక్ష నేతలతో పాటు హరీష్ రావు భార్య, కవిత భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

కూతురి పెళ్లికి పేరోల్ మీద వచ్చిన రేవంత్ రెడ్డి.. అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని ప్రశ్నించారు. ‘నిన్న ముగ్గురు మాజీ మంత్రుల రహస్య భేటీ జరిగింది. మార్చి 19న సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు. విమానంలో రెండు గంటల పాటు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నాకు నోటీసులు పంపిస్తే.. నా వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తా అని అన్నారు. ఈ కేసులో కొందరిని ఇరికించి.. ఇంకొందరిని కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సీబీఐపై నమ్మకం ఉంటే కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నారు.

Next Story

Most Viewed