త్రిబుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం

by Ratna Kumari |

ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

త్రిబుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో /జడ్చర్ల : ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనల్లో భాగంగా మొదటగా ఆయన జడ్చర్ల మండల పరిధిలోని చిట్టే బోయినపల్లి గ్రామ శివారులో ఎంపిక చేసిన స్థలంలో దాదాపుగా రూ.600 కోట్లతో నిర్మిస్తున్న భవనానికి భూమి పూజ చేసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న భవనం తెలంగాణ రాష్ట్రంలో బాసర తర్వాత రెండోది అవుతుంది. దీనితో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యాపరంగా మెరుగుపడనున్నాయి. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కు కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, జిఎంఆర్, మెగా రెడ్డి ఉన్నారు.

Next Story