- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో : ఎవడబ్బ సొమ్మని సీఎం రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం వంద కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు చెప్పాలని, ఇది ముమ్మాటికీ ఆర్ధిక నేరం అవుతుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నేడు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రజాధనంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు ఫుట్ బాల్ ఆడుకుంటారని హెచ్చరించారు.
శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం రూ.ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏ యో శాఖల నుంచి ఖర్చు చేస్తోందో, ఎందుకు ఖర్చు చేస్తోందో వివరణ ఇవ్వాలని డిమాండ్చేశారు. సీఎం రేవంత్ టీమ్ ను సింగరేణి స్పాన్సర్ చేస్తోందని ప్రచారం జరుగుతుందని ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగరేణి డబ్బులను ఎంత ఖర్చు చేస్తున్నారో బయట పెట్టాలన్నారు. ఈ డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి కానీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సూచించారు.
ప్రభుత్వ శాఖలేవైనా దుబారా ఖర్చులు చేస్తే ను కట్టడి చేయాల్సిన సీఎం, స్వయంగా తన సరదా కోసం దుబారా చేయడం ఆర్ధిక నేరమే కింద పరిగణనించాల్సిస్తోందన్నారు. మెస్సీ టీమ్ తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడడంతో రాష్రానికి వచ్చే ప్రయోజనమేంటో ముఖ్యమంత్రి చెప్పాలని నిలదీశారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడితే, అప్పీయరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని ఫీజు ఏ ప్రభుత్వ శాఖ ఇస్తోందో సమాధానం చెప్పాలన్నారు.
దేశంలోనే అత్యుత్తమ పది క్రికెట్ గ్రౌండ్లలో ఒకటైన ఉప్పల్ స్టేడియానికి ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తో తూట్లు పొడుస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ గ్రౌండును ఫుట్ బాల్ గ్రౌండుగా మార్చాలి. మ్యాచ్ ముగిసాక మళ్లీ దాన్ని క్రికెట్ గ్రౌండుగా మార్చాలి. దీని కోసం రూ.10 కోట్ల వరకు ఖర్చు దుబారా అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సింగరేణి శాఖను సీఎం రేవంత్ టీమ్ కు స్పాన్సరుగా ఉండడానికి ఎందుకు అంగీకరించారో చెప్పాలి. ముఖ్యమంత్రికి భట్టి పూర్తిగా సరెండర్ అయ్యారు.
భట్టి ఆర్ధిక శాఖ బిల్లుల క్లియరెన్సుకు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నా సీఎం గ్లోబల్ సమ్మిట్ ముగిసిన నాలుగు రోజులకు ఈ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్విహిస్తూ, ఈ మ్యాచ్ సమ్మిట్ లో భాగమని చెప్పేందుకు మంత్రులకు సిగ్గుండాలి. అసలు గ్లోబల్ సమ్మిట్ ప్లానింగులో ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లేనే లేదన్నారు. సీఎం రేవంత్ తన సరదా కోసం ఫుట్ బాల్ ఆడితే సాన్సర్లను చూసుకోవాలి కానీ సర్కార్ సొమ్ముతో ఫుట్ బాల్ ఆడడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అన్నారు.






