నేటి నుంచి సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం... ఈ సారి కూడా సెంటిమెంట్..

by Dishafeatures2 |
నేటి నుంచి సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం... ఈ సారి కూడా సెంటిమెంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా సీఎం కేసీఆర్ వ్యూహలకు పదునుపెడుతున్నారు. ప్రతీసారి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేయడం కేసీఆర్‌కు ఆనవాయితీగా మారింది. దీంతో ఈ సారి కూడా ఎన్నికల సమయంలో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో రాజశ్యామల యాగం ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం జరగనుంది. సతీమణితో కలిసి కేసీఆర్ యాగంలో పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు యాగంలో పాల్గొననున్నారు.

గత రెండు ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయగా.. ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను బీఆర్ఎస్ ఫాలో అవుతంది. ఈ సారి కూడా సెంటిమెంట్ కలిసొస్తుందని, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి ఈ సారి కూడా కేసీఆర్‌కు సెంటిమెంట్ కలిసొస్తుందా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed