- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్
దళిత బంధులో చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధులో చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి కొంత మంది లంచాలు తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వరంగల్ లో ఓ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ లో మరికొంత మంది నేతలు డబ్బులు తీసుకున్న వ్యవహారంపై తన దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ సొంత పార్టీ నేతల లంచావతారంపై మండిపడ్డారు. నేతలు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని ఇదే రిపీట్ అయితే సహించేది లేదని హెచ్చరించారు.
Read more:
Next Story






