సీఎం కేసీఆర్ పాలనపై పట్టు కోల్పోయారు: అఖిలపక్ష నేతలు

by Disha Web Desk 12 |
సీఎం కేసీఆర్ పాలనపై పట్టు కోల్పోయారు: అఖిలపక్ష నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన ను సీఎం కేసీఆర్​పట్టించుకోవడం లేదని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పాలనపై పట్టు కోల్పోయారన్నారు.టీజేఎస్​పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ...ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో పేపర్ల లీకేజీలు ఒక ట్రెండ్ గా మారిపోయిందన్నారు.

తీవ్రతరం అవుతున్న నిరుద్యోగ సమస్యలు, టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ, పదవ తరగతి పేపర్ల లీకేజీలు తదితర అంశాపై అఖిల పక్ష నాయకులు సమగ్రంగా చర్చించారు. టీఎస్​పీఎస్​సీ పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ" అనే పేరిట ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు.ఇదే అంశంనై గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొ కోదండరాం, తెలంగాణ టీఎస్​పీ పార్టీ అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బచావో ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed