- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ శ్రీమతి జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ శ్రీమతి జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని జమున పొందారన్నారు. నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజా సేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read...
Next Story






