TRS LP భేటీ: టికెట్ల కేటాయింపుపై కుండబద్దలు కొట్టిన KCR

by GSrikanth |   (  Updated:2022-11-15 12:40:00  IST  )

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

TRS LP భేటీ: టికెట్ల కేటాయింపుపై కుండబద్దలు కొట్టిన KCR
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మళ్లీ పాత వారికే టికెట్లు కేటాయిస్తామని అన్నారు. అంతేగాక, గతకొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికల వార్తలు విస్తృతమైన నేపథ్యంలో ముందస్తుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. 2018లో మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు కేసీఆర్ తెలిపారు. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read more:

1.ఎమ్మెల్సీ కవిత పార్టీ మార్పుపై సీఎం KCR సెన్సేషనల్ కామెంట్స్

Next Story