ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

by Malleboina Mahesh |   (  Updated:2025-08-17 16:38:20  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా నడుస్తున్న కూటమి ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం చంద్రబాబు ఈ రోజు ఆరా తీశారు. ఈ క్రమంలో ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్, అనంతపురం ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అనంతరం పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత.. నేతల వ్యక్తిగత పనులు, చర్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు. అనంతరం మూడు ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక కోరినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతలు సైతం ఇలాంటి వివాదాల్లో తలదూర్చవద్దని జాగ్రత్తలు చెప్పినట్లు సమాచారం అందుతుంది.

Next Story