- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మొదలైన CLP మీటింగ్.. ఇవాళే సీఎం ప్రమాణ స్వీకారం..?
by Satheesh |
గచ్చిబౌలిలోని హాటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కొత్తగా ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏక వాక్య తీర్మానం ద్వారా సీఎల్పీ

X
దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలిలోని హాటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కొత్తగా ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏక వాక్య తీర్మానం ద్వారా సీఎల్పీ నేత ఎంపికను ఎమ్మెల్యేలు అధిష్టానానికే అప్పగించనున్నారు. కాగా ఈ భేటీలో సీఎల్పీ నేత ఎన్నికపై స్పష్టం వస్తే.. ఇవాళ రాత్రికి ప్రమాణం స్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. రాజ్ భవన్‌కు టెంట్లు, ఇతర ఫర్నీచర్ సామాగ్రి తరలిస్తుండటంతో సీఎం ప్రమాణస్వీకారం ఇవాళే ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్ భవన్ దగ్గర పోలీసులను భారీగా మెహరించారు. కాగా, సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story






