కేసీఆర్‌ను తిప్పి తిప్పి బంగాళాఖాతంలో పడేస్తాం: సీఎంకు భట్టి స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 19 |
కేసీఆర్‌ను తిప్పి తిప్పి బంగాళాఖాతంలో పడేస్తాం: సీఎంకు భట్టి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. సవాళ్లు, కౌంటర్లు, విమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన మొదలు పెట్టిన సీఎం కేసీఆర్.. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని ఫైర్ అయ్యారు.

దీంతో కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయటం సీఎం కేసీఆర్ తరం కాదని.. మరో నాలుగు నెలలు ఆగితే కేసీఆర్‌ను.. ఆయన ప్రభుత్వాన్ని తిప్పి తిప్పి బంగాళాఖాతంలో పడేస్తామని ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రంలోని పేద ప్రజల భూములను కొల్లగొట్టేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని భట్టి ఆరోపించారు. ధరణి పోర్టల్ రాకముందు రైతులకు పాస్ పుస్తకాలు లేవా అని ప్రశ్నించారు.


Next Story