- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. రేపటి నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ ప్రారంభం!
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులు గురువారం నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులు గురువారం నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలకు హాల్ టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు ఇదే సమయం వర్తిస్తుంది.
మొత్తం 5,28,239 మంది విద్యార్థులు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు 2676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ల కోసం 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపి, ఆపై SSC Hall Ticket March-2026 అని టైప్ చేయడం ద్వారా కూడా పొందవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే 040-23230942 నంబర్‌కు సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.






