- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: మీరు చెప్పేది మేము నమ్మాలి..సీఎం ఢిల్లీ టూర్ పై టి. చిరంజీవులు సెటైర్లు
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు కోసం వచ్చేవారిని బీసీలు నిలదీయాలని చిరంజీవులు పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రితో భేటీ కావడంపై బీసీ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రధాన మంత్రిని సీఎం, డిప్యూటీ సీఎం కలిశారు. గ్లోబల్ సమ్మిట్‍కు ఆహ్వానించడానికి వీరికి అపాయింట్ మెంట్ ఇచ్చిన ప్రధాని మోడీ బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వరు. దీనిని మనం నమ్మాలి అంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు ఇవాళ ఫేస్ బుక్ వేదికగా పోస్టు చేసిన ఆయన.. ఇది మన బీసీల ఖర్మ అని బీసీ ప్రజలంతా ఈ ఆధిపత్య కులాల మోసాన్ని గమనించాలని పిలుపునిచ్చారు.
ఇంకా ఎంతకాలం మౌనంగా చూద్దం? బీసీ ప్రజలు ఇంకా ఎప్పుడు కళ్లుతెరుస్తారు? ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు కోసం వచ్చేవారిని బీసీ బిల్లుపై ప్రశ్నించాలన్నారు. 9వ షెడ్యూల్‌లో బీసీ బిల్లులు ఎప్పుడు? పెడుతారు ఒక వేళ పెట్టని పక్షంలో ఎదుకు పెట్టరు అని? నిలదీయాలన్నారు. మాటలు కాదు, మనీ కాదు, హక్కులు – న్యాయం – గౌరవం కోరుకోండని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో మన ఓటుతో బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మీ ప్రతాపం, సత్తా, పౌరుషం చూపించాలనన్నారు.






