- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth Reddy: భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణాల కోసం పెండింగ్‍లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులపై ఇవాళ సెక్రటేరియట్‍లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రోడ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‍రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.
హైదరాబాద్-బందరు పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రస్తావన:
ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం.. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించిన ముఖ్యమంత్రి.. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల వివరాలను ఉన్నతాధికారులకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






