- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాన్ వెజ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు
సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. కోళ్లకు వ్యాధులు రావడం, ఎండాకాలం కావడంతో శరీరానికి వేడి చేస్తుందని తక్కువ తినడం ఇలా రకరకాల కారణాల వల్ల చికెన్ ధరలు తగ్గుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. కోళ్లకు వ్యాధులు రావడం, ఎండాకాలం కావడంతో శరీరానికి వేడి చేస్తుందని తక్కువ తినడం ఇలా రకరకాల కారణాల వల్ల చికెన్ ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా చికెన్ ధరలు గతవారం భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.300 నుండి రూ.350 వరకు పలికింది. అయితే మళ్లీ ఈ రోజు ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.250 నుండి రూ.260 మధ్య విక్రయిస్తున్నారు.
ఖమ్మంలో కేజీ చికెన్ ధర రూ.280గా ఉంది. అంతే కాకుండా ఏపీ విషయానికి వస్తే విజయవాడలో కేజీ రూ.310 అమ్ముతుండగా గుంటూరులో రూ.260, రాజమండ్రిలో రూ.250కి కేజీ అమ్ముతున్నారు. మొన్నటి వరకు చికెన్ ధరలు పెరగటంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా చేపలు తినేందుకు ఎక్కవ ఆసక్తి చూపించారు. ఇప్పుడు మళ్లీ ధరలు తగ్గడంతో చికెన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఇక మటన్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కేజీ రూ.800 నుండి రూ.950 వరకు పలుకుతోంది. ఇతర జిల్లాల్లో రూ.700 నుండి రూ.800 వరకు విక్రయిస్తున్నారు.






