TSLDA చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చరణ్ కౌశిక్ యాదవ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-13 17:31:37  IST  )

తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ పదవీ బాధ్యతలు చేశారు.

TSLDA చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చరణ్ కౌశిక్ యాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (TSLDA) చైర్మన్‌గా నియమితులైన చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ పదవీ బాధ్యతలు చేశారు. మాసబ్ ట్యాంక్‌లోని ఏజెన్సీ కార్యాలయంలో ఆయన శాస్త్రోక్తంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చరణ్ కౌశిక్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, మంత్రి వాకిటి శ్రీహరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పశుసంపద అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. లైవ్‌స్టాక్ రంగంలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, పలువురు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story