Chandrababu Naidu : చంద్రబాబు అరెస్ట్ : న్యాయవాది ఏం చెప్పారంటే?

by Sathputhe Rajesh |   (  Updated:2023-09-09 09:26:55  IST  )

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Chandrababu Naidu : చంద్రబాబు అరెస్ట్ : న్యాయవాది ఏం చెప్పారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నిస్తున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, కేసుతో సంబంధం లేని సెక్షన్లను చంద్రబాబుపై నమోదు చేశారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 37వ ముద్దాయిగా పేర్కొన్నట్లు తెలిపారు. కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లను చంద్రబాబుపై నమోదు చేసినట్లు న్యాయవాది తెలిపారు. నోటీసులను చంద్రబాబుకు పోలీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా చంద్రబాబును పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు.

Next Story