- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chamala: సోనియా గాంధీకి ఎంపీ చామల కిరణ్ స్పెషల్ విషెస్
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(AICC Leader Sonia Gandhi) పుట్టిన రోజు(Birthday) సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala kiran Kumar Reddy) విషెస్(Wishes) తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(AICC Leader Sonia Gandhi) పుట్టిన రోజు(Birthday) సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala kiran Kumar Reddy) విషెస్(Wishes) తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. దీనిపై ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేస్తూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించి, నేటి తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కారణమైన సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. కాగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. దీనిపై మన ఆడబిడ్డల ఆహార్యానికి ప్రతిరూపంగా, తెలంగాణ సంప్రదాయాలకు నిదర్శనంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ చామల కిరణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.






