- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చామల కీలక వ్యాఖ్యలు
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్ అనే వ్యక్తి లోక్ సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని హితువు పలికారు. 18 వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.
ప్రతి సారి డిస్ట్రబ్ చేస్తున్నారు..
రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి సారి డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు. నిశికాంత్ ధూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారని ఆవేదన చెందారు. దేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారని మండిపడ్డారు. మహిళా ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అందుకే లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలని తెలిపారు. మోడీ ప్రధాన మంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్‌హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారని, పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎట్లా డిసైడ్ చేస్తారని ఫైర్ అయ్యారు. మోడీ ఎందుకు ట్రంప్ తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు.






