Rajesh Agarwal: ఫార్మా ఎగుమతుల బలోపేతానికి కేంద్రం సహకారం

by Gantepaka Srikanth |

భారత ఫార్మా రంగాన్ని బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌లో శనివారం ఉన్నతస్థాయి చింతన్ శివిర్ నిర్వహించారు.

Rajesh Agarwal: ఫార్మా ఎగుమతుల బలోపేతానికి కేంద్రం సహకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత ఫార్మా రంగాన్ని బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌లో శనివారం ఉన్నతస్థాయి చింతన్ శివిర్ నిర్వహించారు. కేంద్ర వాణిజ్య శాఖ, ఫార్మెక్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశీయ ఫార్మా అవసరాల్లో 90 శాతం స్వదేశీ ఉత్పత్తి ద్వారానే తీర్చుకోవాలని, ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. 60 బిలియన్ డాలర్ల విలువైన భారత ఫార్మా పరిశ్రమలో సగం వాటా ఎగుమతులదేనని, నాణ్యతతో కూడిన ఆవిష్కరణల ద్వారా భారత్ ప్రపంచపు ఫార్మసీగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బయోఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ. 10,000 కోట్లతో ప్రవేశపెట్టిన బయోఫార్మా శక్తి పథకం ఇందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇదే వేదికపై సెప్టెంబర్ 7 నుండి 9 వరకు జరగనున్న ఐపెక్స్-2026 ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. సమావేశంలో ఫార్మెక్సిల్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story