యూరియా వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ఆదేశాలు.. రాష్ట్రంలో అవగాహన సదస్సులు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఏటేటా యూరియా వాడకం పెరిగిపోతుంది. దీంతో కేంద్రం సకాలంలో పంటలకు సరిపడ సరఫరా చేయడం భారంగా మారింది.

యూరియా వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ఆదేశాలు.. రాష్ట్రంలో అవగాహన సదస్సులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఏటేటా యూరియా వాడకం పెరిగిపోతుంది. దీంతో కేంద్రం సకాలంలో పంటలకు సరిపడ సరఫరా చేయడం భారంగా మారింది. వ్యవసాయ శాస్త్రవేత్తల పలుమార్లు సూచించిన రైతులు ఇష్టానుసారంగా కొనుగోలు చేసి సన్న, చిన్నకారులకు దొరకుండా చేస్తున్నారు. ఇదే విధంగా రైతులు యూరియా వాడితే భవిష్యత్తులో భూసారం తగ్గి పంటలు పండకుండా పోతాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా అన్నదాతలు పంట అధికంగా దిగుబడి రావాలని ఎకరానికి రెండు బస్తాలు వినియోగించాల్సి ఉంటే నాలుగు బస్తాలు చల్లుతున్నారు. ఇదే స్థాయిలో యూరియా వాడకం చేస్తే సరిపడా సరఫరా చేయడం కష్టమవుతుందని వ్యవసాయ శాఖ భావించి నేరుగా బస్తాలు పంపిణీ చేయకుండా యాప్ ద్వారా బస్తాలు బుకింగ్ చేసుకుంటే ఇస్తామనే విధానం తీసుకరావడంతో కొంతమేరకు వాడకం తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రానున్న నాలుగైదు ఏళ్లలో యూరియా వాడకం తగ్గిస్తామని ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా రాష్ట్రాలు దశల వారీగా యూరియా వినియోగం తగ్గేలా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. యూరియా వినియోగాన్ని ఏవిధంగానైనా నాలుగేళ్లలో సగానికి తగ్గించాలని సూచించింది. అందుకోసం ప్రభుత్వం ఒకేసారి త గ్గించాలని రైతులకు చెబితే పట్టించుకోరని, పంపిణీ విధానంలో మార్పులు చేయాలని భావించింది. ఈ రబీ సీజన్ లో 10.25 లక్షల మెట్రిక్ టన్నులు యూ రియా కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని కోరిం ది. ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సరఫరా కాలేదు. ఈ పంట కాలంలో వినియోగం 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు తీసుకరావాలని వ్యవ సాయ శాఖ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.

యూరియా అధికంగా వాడితే భూమి విషతుల్యం

ఇదే తరహాలో రైతులు అడ్డగోలుగా యూరియా వాడకం చేస్తే భూమి విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పంపిణీ జరిగే యూరియాను ఎక్కువ మొత్తంలో వాడితే పంట ఉత్పత్తికి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోనే పరిస్థితి వస్తోంది. పంట తగ్గడంతో ప్రజల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశానంటుతాయి. దీంతో పేద, సామాన్య ప్రజలు పస్తులుండే రోజులు రాక తప్పదని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తే నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని, ఫర్టిలైజర్ ఎక్కువ వాడితే సాగు భూముల్లో చివరికి పశువుల మేతకు గడ్డి కూడా పెరగదని హెచ్చరిస్తున్నారు. భూములు విషతుల్యం అయితే భవిష్యత్తు తరాలు తిండి కోసం తిప్పలు పడే దుస్థితి వస్తుందని చెబుతున్నారు.

రసాయన ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులు

రైతులు పంట అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు వినియోగం చేయకుండా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగిస్తోంది. స్థానికంగా ఉండే విస్తరణాధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో అన్నదాతలకు వివరించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలివ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుత సీజన్ లో యూరియా అధిక మొత్తంలో స్టాక్ దుకాణాల్లో ఉండకుండా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా అందులో ఈ పంటకాలంలో వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు 1.10 కోట్ల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేస్తోంది. సాగుకు తగిన విధంగానే యూరియా నిల్వలు ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది.

Next Story