మే 10 నుంచి రాష్ట్రంలో జనగణన.. కలెక్టర్లతో సీఎస్ కీలక సమీక్ష షురూ

by Kema Shiva Kumar |

మే 10 నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియపై సచివాలయంలో సీఎస్ రామకృష్ణ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.

మే 10 నుంచి రాష్ట్రంలో జనగణన.. కలెక్టర్లతో సీఎస్ కీలక సమీక్ష షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మే 10 నుంచి ప్రారంభం కానున్న జనగణన (Census Enumeration) ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ సచివాలయం (Secretariat)లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (C Rama Krishna Rao) అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సీఎస్ సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఎన్యుమరేటర్ల నియామకం, వారికి అందించాల్సిన శిక్షణ, క్షేత్రస్థాయిలో గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం వంటి అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మే 10 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించనున్నారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక మరియు పలువురు సెన్సెస్ అధికారులు పాల్గొన్నారు.

Next Story