- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల దీక్షలో ప్రముఖులు!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో తమ గూడును ఛిద్రం చేయడం అన్యాయమంటూ మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్ట్‌మెంట్ వాసులు కదం తొక్కారు.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో తమ గూడును ఛిద్రం చేయడం అన్యాయమంటూ మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్ట్‌మెంట్ వాసులు కదం తొక్కారు. నిబంధనల ప్రకారమే అపార్ట్‌మెంట్ నిర్మించుకున్నాక, ఇప్పుడు ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తూ వారు చేపట్టిన దీక్ష తీవ్ర రూపం దాల్చుతోంది. బాధిత అపార్ట్‌మెంట్ వాసులకు మద్దతుగా పలువురు విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చారు.
ప్రముఖుల మద్దతు..
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అభివృద్ధి పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టులు కే.శ్రీనివాస్, వెంకట్ జివీ, మరియు ప్రముఖ యూట్యూబర్ తులసి చందు పాల్గొని, అపార్ట్‌మెంట్ వాసుల గోడును ప్రభుత్వం వినాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్ కుమార్, ప్రజాసంఘాల నాయకురాలు సజయ తదితరులు మాట్లాడుతూ.. చట్టబద్ధమైన అనుమతులున్న భవనాలను తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని మండిపడ్డారు.
అపార్ట్‌మెంట్ వాసుల ఆవేదన..
జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముతో అపార్ట్‌మెంట్ కొనుక్కుంటే, ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పేరుతో రోడ్డున పడేయాలని చూడటం ఏంటని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్ చేయాలని వారు కోరుతున్నారు.






