పత్తి రైతులపై CCI కుట్రలు.. కొనుగోళ్లపై రోజుకో కొత్త నిబంధనలు

by Kema Shiva Kumar |

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది.

పత్తి రైతులపై CCI కుట్రలు.. కొనుగోళ్లపై రోజుకో కొత్త నిబంధనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ పక్క అకాల వర్షాలు పంటలు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రభుత్వాలు పండిన పంటను కొనేందుకు కొర్రీలు పెట్టడం విడ్డూరంగా ఉంది. అమ్మ అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో పత్తి రైతుల దుస్థితి. కాగా, పత్తి రైతులపై కాటన్​కార్పొరేషన్​ఆప్​ఇండియా వివక్షత చూపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పడు లేని విధంగా పత్తి అమ్మకాలు చేయాలంటే కపాస్​కిసాన్ యాప్​తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా ఎకరానికి 7 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామనే నిబంధన తీసుకొచ్చి అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి తోడు జిన్నింగ్ మిల్లులను ఎల్​1, ఎల్​2, ఎల్​3గా విభజించి అందులో మొదటి దాంట్లో 50 శాతం కొనుగోలు పూర్తి అయిన తర్వాత ఎల్2 కు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తోంది. దీంతో కిసాన్ ​యాప్‌లో నమోదు చేసుకున్న రైతుకు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు సమయం వచ్చే సరికి చాలా గడువు పడుతుంది. దీంతో రైతులు అప్పటి వరకు పత్తిని దాచిపెట్టాల్సి వస్తోంది.

ఇప్పటికే బారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నదాతలు అప్పలు బాధలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు సీసీఐ తీసుకొచ్చిన కొత్త విధానాలు పుండు మీద కారం చల్లినట్లు ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా పత్తి చేనులోని తీశారు. సుమారుగా ఎకరం ఉన్న రైతుల ఆరేడు క్వింటాళ్ల వరకు అమ్మకాలకు సిద్దంగా ఉన్నారు. 10 ఎకరాలకు వరకు సాగు చేసిన రైతులు వద్ద భారీగా పత్తి నిల్వలు ఉండటంతో కొనుగోలుపై పరిమితం విధించడంతో పూర్తి పత్తి అమ్మకం చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు రైతులు ప్రైవేటు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. కేంద్ర మద్దతు ధర రూ. 8110 ఉండగా, బ్రోకర్లు రూ.6110 కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే తాను జిన్నింగ్ మిల్లర్లు సహకారంతో గుట్టుగా అమ్మకాలు చేస్తుకోవాల్సింది. వాతావరణం కారణంగా పత్తి తేమ 7 నుంచి 8 శాతం మాత్రమే వస్తొంది. 12 శాతం ఉంటే కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెప్పడం రైతులకు భారంగా మారింది.

కపాస్​ కిసాన్ ​యాప్​ వెనుక కుట్ర

కేంద్రం పత్తి అమ్మకాలు నేరుగా చేయకుండా కపాస్​కిసాన్​యాప్​తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో ద్వారా ఆయాప్​లో రైతులు పట్టాపాసు పుస్తకం ద్వారా నమోదు చేసుకుని స్లాట్​బుకింగ్​చేసుకోవాలి. కానీ సీసీఐ అధికారులు కుట్రతో ఉదయం పూట రైతులకు అందుబాటులో ఉండాల్సిన యాప్​రాత్రి 10 గంటల తరువాత ఓపెన్‌గా ఉండటంతో స్లాట్​బుక్​చేసుకునే అవకాశం దొరకడం లేదు. రాత్రి వేళ్లలో జిన్నింగ్​మిల్లుల యాజమాన్యాలు తమకు తెలిసిన రైతులకు యాప్​ఓపెన్​ఉందని గుట్టుగా సమాచారం ఇచ్చి వారు నమోదు చేసుకునేలా చేస్తూ తూకం వేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి రైతులు ఎక్కడ అమ్ముకోవాలని తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ స్లాట్​ దొరికితే ఎల్‌1, ఎల్‌2 కేంద్రాలకు అల్టాట్​చేస్తే అది సమీపంలో ఉండదు. దూరంగా ప్రాంతాలకు వెళ్లితే రవాణా ఖర్చులకే సగం పోతున్నాయి. అక్కడ అమ్మడం కంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్మడం అనే ఆలోచనలకు రైతులు వస్తున్నారు. సీసీఐ తీసుకొస్తున్న కొత్త నిబంధనలు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. స్ధానిక రైతులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి సమీపంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పరిమితం ఎత్తి వేసే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిసాన్​యాప్​24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని ఆదేశించడంతో రెండు మూడు రోజుల పాటు ఉంచినట్లు తెలిసింది.

అందుకే కేంద్రం కొత్త నిబంధనలు

పత్తి కొనుగోలు విధానం ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకో నిబంధన తీసుకరావడవం వెనుక ఉన్న అంత్యరమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పత్తిని సులభంగా అమ్మకాలు చేసే పద్దతి ఉండేదని, ఈ ఏడాది యాప్, 7 క్వింటాళ్ల పరిమిత వంటి నిబంధనలు తేవడం భవిష్యత్తులో పత్తి కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేయదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కార్పొరేట్​శక్తుల పాత్ర ఉందని, వారే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో పూర్తిగా ప్రైవేటు వ్యాపారులకు అనుగుణంగా నిబంధనలు తీసుకొచ్చి వారికి పత్తి కొనుగోలు వ్యవహారం అప్పగిస్తోందని అంచనా వేస్తున్నాయి. ఐదారు సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు కూడా కార్పొరేట్​శక్తుల చేతిలోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు.

Next Story