- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bus Accident: కావేరి బస్సు ప్రమాదం.. వెలుగులోకి బైకర్ శివశంకర్ మరో సంచలన వీడియో
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలులో బస్సు ప్రమాద ఘటనలో బైకర్ కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరణించిన బైకర్ శివశంకర్ ప్రమాదానికి ముందు రోజు మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. CCTV ఫుటేజ్ ప్రకారం.. గురువారం సాయంత్రం 7 గంటలకు ఒకసారి, మళ్లీ రాత్రి 8.25 గంటలకు శివశంకర్ పెద్దటేకూరు గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు కావేరి బస్సు ప్రమాదం దర్యాప్తునకు మరో కీలక ఆధారంగా మారింది.
కాగా, తన స్నేహితుడు ఎర్రి స్వామిని దింపడానికి వెళ్తుండగా, శివశంకర్ డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మరణించాడు. అయితే ఎర్రి స్వామి శివశంకర్ మృత దేహాన్ని రోడ్డుమీద నుంచి పక్కకు లాగాడు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న బైక్‌ను పక్కకు జరుపుదామనే సమయంలోనే వేగంగా వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి వంటలు వ్యాపించాయి, దీంతో 19 మంది సజీవ దహనం అయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కర్నూలు పోలీసులు ఎర్రిస్వామిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వీడియో కోసం క్లిక్ చేయండి..
READ MORE ....






