weight loss drugs : బరువు తగ్గించే మందులతో జాగ్రత్త.. సెమాగ్లుటైడ్‌పై డీసీఏ హెచ్చరిక

by Ramesh Naini |

బరువు తగ్గడానికి, టైప్-2 డయాబెటిస్ చికిత్సకు విరివిగా వాడుతున్న సెమాగ్లుటైడ్ ఔషధాల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ షానవాజ్ ఖాసిం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

weight loss drugs : బరువు తగ్గించే మందులతో జాగ్రత్త.. సెమాగ్లుటైడ్‌పై డీసీఏ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: బరువు తగ్గడానికి, టైప్-2 డయాబెటిస్ చికిత్సకు విరివిగా వాడుతున్న సెమాగ్లుటైడ్ ఔషధాల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ షానవాజ్ ఖాసిం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 2026 తో ఈ మందుల పేటెంట్ గడువు ముగిసిపోతుండటంతో మార్కెట్లోకి వస్తున్న వివిధ కంపెనీల ఫార్ములేషన్ల (మల్టీ-డోస్ వయల్స్, ప్రీ-ఫిల్డ్ పెన్స్) వాడకంపై కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. సెమాగ్లుటైడ్ మందులను కేవలం ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కార్డియాలజిస్టుల పర్యవేక్షణ, ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలని డీసీఏ సూచించింది. బరువు తగ్గడం కోసం డాక్టర్ సలహా లేకుండా సొంతంగా ఈ మందులను వాడటం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అజాగ్రత్తగా వాడితే ప్యాంక్రియాటైటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలు, గాల్ బ్లాడర్ వ్యాధులు, తీవ్రమైన జీర్ణకోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

ఈ మందులను కేవలం లైసెన్స్ కలిగిన మెడికల్ షాపుల్లోనే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా అనధికార విక్రేతల వద్ద కొంటే అవి నకిలీవి లేదా నాణ్యత లేనివి అయ్యే ప్రమాదం ఉంది. కంపెనీలు ఈ మందుల గురించి తప్పుదారి పట్టించేలా పరోక్ష ప్రకటనలు ఇవ్వకూడదని, ఆఫ్-లేబుల్ వాడకాన్ని ప్రోత్సహించకూడదని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. రోగి యొక్క ఆరోగ్య చరిత్రను పూర్తిగా పరిశీలించిన తర్వాతే వైద్యులు తగిన మోతాదును నిర్ణయిస్తారని, ప్రజలు ఈ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దని డీసీఏ కోరింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ మందులను విక్రయించినా లేదా ప్రచారం చేసినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story