CI, ఎస్ఐలపై మానవ హక్కుల ట్రిబ్యునల్‌ నోటీసులు.. కారణమిదే..!

by Disha Web Desk 4 |
CI, ఎస్ఐలపై మానవ హక్కుల ట్రిబ్యునల్‌ నోటీసులు.. కారణమిదే..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తమ సొంత భూమి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీపై పోలీసులకు, న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినందుకు డిచ్‌పల్లి సిఐ, జక్రాన్ పల్లి ఎస్ఐలపై బాధితులు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సిఐ మల్లేష్, జక్రాన్‌పల్లి ఎస్ఐ తిరుపతిలకు మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన జగడం మోహన్ జగడం భూషన్, జగడం భాస్కర్లకు గ్రామాభివృద్ధి కమిటీతో విభేదాలు ఉన్నాయి.

తమ సొంత భూమి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ వేధింపులపై బాధితులు జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 05/2024,10/2024 ఎఫ్‌ఐఆర్ నంబర్లపై కేసు నమోదు చేశారు. బాధితులు ఈ విషయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామాభివృద్ధి కమిటీ తరఫున డిచ్‌పల్లి సిఐ , జక్రాన్ పల్లి ఎస్సైలు బాధితులను వేధింపులకు గురి చేశారు అని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పోలీస్‌స్టేషన్‌లో తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచి కేసులు వెనక్కి తీసుకోవాలని వేధింపులకు గురి చేయడంతో వారు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ స్వీకరించి నోటీసు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వరకు చేరడంతో ఆయన సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.. కేసులు నీరుగార్చేందుకు పోలీసు అధికారులు నేతలతో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. ట్రిబ్యునల్‌కు హాజరైన పోలీసు అధికారులను, బాధితులను పోలీస్‌స్టేషన్ పిలిపించి విచారణ జరిపిన విషయంలో పోలీస్ స్టేషన్ సిసి టివి ఫుటేజీలను సమర్పించాలని ట్రిబ్యునల్ కోర్టు న్యాయస్థానం ఆదేశించింది.

Next Story

Most Viewed