స్వేచ్ఛాయుత ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం

by Disha Web Desk 15 |
స్వేచ్ఛాయుత ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం
X

దిశ, రేగోడ్ : సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్ లో ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఐ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో జరిగిన సమావేశంలో కేరళ రాష్ట్రంలోని కేసర్ గోడ్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ రాజ్ మోహన్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 ఏండ్ల కుటుంబ పాలన పోవడానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన వాగ్దానాలను, 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. పాలన చేపట్టిన 4 నెలల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ ను, ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆందోల్ నియోజకవర్గంలో సుమారు 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. వట్పల్లిలో పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. వట్పల్లిని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. 11 కోట్లతో వట్పల్లిలోని మార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత పది ఏళ్లలో నిర్లక్ష్యం చేసిన రోడ్లను నూతనంగా నిర్మించడానికి ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. త్వరలో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేటలో 55 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నామన్నారు.

జోగిపేటను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. వచ్చే నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి అవకాశం కల్పిస్తామన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీలు లేవన్నారు. తెలంగాణ మాదిరిగా కేంద్రంలో పదేళ్ల పాలనను ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. నియోజకవర్గంలో త్వరలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజకీయాల్లో కార్యకర్తలు, యువత పాత్ర ఎంతో గొప్పదన్నారు.

Next Story

Most Viewed