రేవంత్ రెడ్డి రాజీనామాకు రంగం సిద్ధం.. త్వరలోనే మరో బడా లీడర్‌కు బాధ్యతలు

by GSrikanth |
రేవంత్ రెడ్డి రాజీనామాకు రంగం సిద్ధం.. త్వరలోనే మరో బడా లీడర్‌కు బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు జరుగబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హైకమాండ్ పరోక్షంగా ఇప్పటికే హింట్ ఇచ్చింది. ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఆయన స్థానంలో మరో కీలక లీడర్ పగ్గాలు చేపట్టనున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. రేసులో ఇప్పటికే తాను ఉన్నానంటే తాను ఉన్నానంటూ చాలా మంది బడా లీడర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఎవరు పీసీసీ చీఫ్‌గా ఉండాలో ఇప్పటికే తేల్చిసినట్లు సమాచారం.

రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేశ్ కమార్ గౌడ్ రేసులో ఉన్నారు. జూన్ చివరలో స్థానిక సంస్థల ఉండటంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం ఫిక్స్ అయింది. అయితే ఎస్సీ సామాజికవర్గానికి అవకాశం ఇస్తే భట్టి విక్రమార్క లేదా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఓసీలో అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక బీసీల్లో మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. మరి అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో అధికారిక ప్రకటన వెలువడ్డాక తెలియనుంది.

Read More..

BREAKING : రేపు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ

Next Story

Most Viewed