హైదరాబాద్ BJP MP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

by GSrikanth |

హైదరాబాద్ BJP MP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు అయింది. ప్రచారంలో ముస్లింలను కించపరిచేలా మాధవీలత కామెంట్లు చేస్తున్నారని షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ BJP MP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ BJP MP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు అయింది. ప్రచారంలో ముస్లింలను కించపరిచేలా మాధవీలత కామెంట్లు చేస్తున్నారని షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ప్రచారంలో ముస్లింల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్‌ చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని మాధవీలత హెచ్చరించారు. మైనార్టీలకు ఒవైసీ చేసిన న్యాయం ఏమిలేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ సారి హైదరాబాద్‌ కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story