HYD: ఆ ఫేమస్ స్వీట్‌ హౌజ్‌లో ఫంగస్ పట్టిన మిఠాయిలు.. బీ అలర్ట్..

by Gantepaka Srikanth |

షాప్‌కు వెళ్లామా? కావాల్సింది కొనుక్కున్నామా? అని కాకుండా.. ప్రతి ఒక్కరూ ఎక్స్‌పైరీ డేట్, మానుఫాక్చరింగ్ డేట్‌ను తప్పకుండా చూసుకోవాలి.

HYD: ఆ ఫేమస్ స్వీట్‌ హౌజ్‌లో ఫంగస్ పట్టిన మిఠాయిలు.. బీ అలర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: షాప్‌కు వెళ్లామా? కావాల్సింది కొనుక్కున్నామా? అని కాకుండా.. ప్రతి ఒక్కరూ ఎక్స్‌పైరీ డేట్, మానుఫాక్చరింగ్ డేట్‌ను తప్పకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు తీసుకెళ్లే ప్రతీ ఆహార పదార్థాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ముందు జాగ్రత్త పడకుండా తర్వాత బాధపడి ఉపయోగం లేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అన్నీ కల్తీ అయిపోతున్నాయి. అనేక దుకాణాల్లో ఎక్స్‌పైరీ అయిపోయిన సరుకులు అమ్మేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో అయితే ఏకంగా ఎక్స్‌పైరీ, మానుఫాక్చరింగ్ డేట్‌ లేని సరుకులను కూడా యథేచ్చగా అమ్మేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌(Hyderabad)లో వెలుగుజూసింది. అత్తాపూర్‌లోని హల్దీరాం స్వీట్ హౌస్‌(Haldiram Sweet House)లో కల్తీ, ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారు. ఇటీవల షాప్‌ను విజిట్ చేసిన ఓ యువకుడు దీనిని గమనించాడు. పాడైపోయిన స్వీట్ల అమ్మకాలపై ప్రశ్నించారు. అతని పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై BNS చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, నమూనాలను పరీక్షల నిమిత్తం FSLకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story