బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదు

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు.. ఒకరిపై మరొకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదు
X

దిశ వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు.. ఒకరిపై మరొకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తును ముద్రించిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు (Electoral Officers) తక్షణమే స్పందించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు మాగంటి సునీత (Maganti Sunitha) పై కేసు నమోదు చేసినట్లు బోరబండ పోలీస్‌ స్టేషన్‌ (Borabanda Police Station) పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన సందర్భంలో తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story