- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
by Naga Rani Yarlagadda |
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. మంగళవారం (నవంబర్ 11) జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల నిబంధనలు పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. యూసఫ్ గూడ పోలింగ్ కేంద్రాల వద్ద కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, తన అనుచరులతో మహమూద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకువెళ్లారని పోలీసులు వెల్లడించారు. పోలీసులను లెక్క చేయకుండా నెట్టుకుని వెళ్లడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారన్నారు. కౌశిక్ రెడ్డిపై ట్రేస్ పాసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story






