మద్యం మత్తులో కారు రాష్ డ్రైవింగ్.. చూస్తుండగా ఒక నిండు ప్రాణం బలి !

by Geesa Chandu |

అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కలగలసి.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

మద్యం మత్తులో కారు రాష్ డ్రైవింగ్.. చూస్తుండగా ఒక నిండు ప్రాణం బలి !
X

దిశ,వెబ్ డెస్క్: అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కలగలసి.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్, రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఓ పాదాచారున్ని రెప్పపాటులో నిర్ధాక్షిణ్యంగా కారుతో గుద్ది చంపాడు.

వివరాల్లోకి వెళ్తే..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజులరామారం దగ్గర.. ఒక వ్యక్తి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుండగా.. అటుగా వస్తున్న ఒక కారు, వేగంగా వచ్చి ఆ పాదాచారున్ని ఢీకొట్టింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే చనిపోయిన వ్యక్తి పేరు గోపి అని, అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపిన వివరాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘోర ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, ఇంతటి ఘోరమైన ఘాతుకానికి కారణమైన మద్యం సేవించి వాహనం నడిపిన కారు డ్రైవరును మరియు మద్యం మత్తులో ఉన్న కారులోని ఇతర యువకులందరిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story