- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఎమ్మెల్యే కారు మీదకు దూసుకొచ్చిన బస్సు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు పెను ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్(Cantonment MLA SriGanesh)కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఆయన మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలో పర్యటించారు. మంచిర్యాల బస్ స్టాప్ దగ్గర ఆ కాన్వాయ్ మీదకు ఓ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎమ్మెల్యే కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసి హుటాహుటిన స్పాట్ వచ్చిన పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. నల్లగొండ మండలం చర్లపల్లిలో జరిగిన కారు ప్రమాదంలో లాస్య నందిత మృతిచెందారు. ఆమె మరణానంతరం కంటోన్మెంట్‌లో జరిగిన ఉపఎన్నికలో శ్రీగణేశ్ విజయం సాధించారు.






