'ఓట్ల దొంగలు గద్దె దిగండి' : కాంగ్రెస్​ శ్రేణుల క్యాండిల్​ ర్యాలీలు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-14 16:52:50  IST  )

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో 'ఓట్ చోర్ గద్ది చోడ్' ఓట్ల దొంగలు గద్దె దిగండి అంటూ కాంగ్రెస్​ శ్రేణులు క్యాండిల్​ ర్యాలీలు నిర్వహించారు.

ఓట్ల దొంగలు గద్దె దిగండి : కాంగ్రెస్​ శ్రేణుల క్యాండిల్​ ర్యాలీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో 'ఓట్ చోర్ గద్ది చోడ్' ఓట్ల దొంగలు గద్దె దిగండి అంటూ కాంగ్రెస్​ శ్రేణులు క్యాండిల్​ ర్యాలీలు నిర్వహించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించిన నేపథ్యంలో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్​పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాలలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో జరిగిన ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మెట్టు సాయి కుమార్, విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story