- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యర్థి ఓటును వేరే గ్రామానికి బదిలీ చేయించిన అభ్యర్థి
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో సలీమ్ అనే యువకుడు వార్డు అభ్యర్థిగా

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో సలీమ్ అనే యువకుడు వార్డు అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా అతడి ఓటు జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఓటర్ జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో అధికారులను సంప్రదించగా సలీం ఓటు మొగిలిగిద్ద గ్రామానికి బదిలీ అయిందని వివరించారు.
దీంతో తన ప్రమేయం లేకుండా ఓటు ఎలా బదిలీ అవుతుందని సలీమ్ అధికారులను ప్రశ్నించాడు. అంజాద్ అనే మరో అభ్యర్థి తన ఓటును బదిలీ చేయించాడని సలీమ్ ఆరోపిస్తున్నాడు. అంజాద్ పై చర్యలు తీసుకోవాలని సలీమ్ డిమాండ్ చేస్తున్నాడు. అంజాద్ కామన్ సర్వీస్ సెంటర్ నడిపిస్తున్నాడని, ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకుని ఓటును బదిలీ చేయించాడని చెప్పాడు. ఆర్‌టీ యాక్ట్ కింద అప్లికేషన్ ఇవ్వడంతో తన ఓటును బదిలీ చేయించింది అంజాద్ యే అని తెలిసిందన్నాడు. అతడి నామినేషన్ రద్దు చేయాలని ఎన్నికల అధికారులను కోరాడు.






