- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వివేక్‍కు చెక్ పెట్టేలా ఎత్తులు.. క్యాతనపల్లిలో మళ్లీ క్యాంపు రాజకీయాలు
క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదాతో మళ్లీ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి.

దిశ, డైనమమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో క్యాతనపల్లి మున్సిపల్ (Kyathanpally Municipality) చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ పదవులకు సంబంధించిన ఎన్నిక ఇవాళ మరోసారి వాయిదా పడటంతో ఇక్కడ మరోసారి క్యాంపు రాజకీయాలకు షూరూ అయ్యారు. ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS), సీపీఐ (CPI) కౌన్సిలర్లను ఆయా పార్టీలు క్యాంపుకు తరలిస్తున్నాయి. నిన్న రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు తలపెట్టగా వివిధ కారణాలతో 11 చోట్ల వాయిదా పడ్డాయి. ఇందులో క్యాతనపల్లికూడా ఉంది. ఇవాళ ఎన్నిక కోరమ్ సభ్యులంతా సమయానికి అందుబాటులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్, సీపీఐ పార్టీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివేక్‍కు బిగ్ టాస్క్:
ఇక్కడ చైర్ పర్సన్ పదవి ఎలాగైనా తామే దక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇది మంత్రి వివేక్ (Vivek) సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రి ప్రయత్నాలకు గండి కొట్టేందుకు బీఆర్ఎస్ అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. దీంతో ఇక్కడ వివేక్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ సంచలనంగా మారింది. ఈ క్రమంలో మంత్రి చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో తన ఇజ్జత్ కా సవాల్ గా మారిన క్యాతనపల్లిలో వివేక్ పై చేయి సాధిస్తారా లేక బీఆర్ఎస్ ముందు తేలిపోతారా అనేది వేచి చూడాలి.
ఉదయం నుంచి ఉద్రిక్తత:
ఇవాళ ఉదయం క్యాతనపల్లిలో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్-10, కాంగ్రెస్-7, సీపీఐ 4, ఇండిపెండెంట్-1 గెలుపొందారు. ఇక్కడ రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ బలం ఇక్కడ 10కి చేరింది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.






